కాంగ్రెస్‌ ఎంపీ(Congress MP) రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం పట్ల విపక్ష నేతలు, మేథావులు స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తిట్టిపోస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM KCR) కూడా నరేంద్రమోదీ(PM Modi) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) దుర్నితిని ఎండగట్టారు.

"భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట.
రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి.బీజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి.." అని కేసీఆర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ కూడా రాహుల్‌పై అనర్హత వేటును ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది నియంతృత్వ చర్య అని, కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. రాహుల్‌ కోసం పోరాటం చేస్తామన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం అధర్మమని, దీనిపై మౌనంగా ఉండబోమని, న్యాయపోరాటం చేస్తామని అన్నారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌(Jairam Ramesh). రాహుల్‌ను చూసి మోదీ భయపడెతున్నారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిజాలు భరించలేకపోతున్నాయని సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌(Digvijaya Singh) అన్నారు.

Updated On 24 March 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story