Anna Bau Sathe : అన్నా బావు సాఠేను గుర్తు చేసిన కేసీఆర్... ఎవరీ అన్నా బావు?
మహారాష్ట్ర(Maharastra) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్(BRS) అధినేత అన్నా బావు సాఠె(Anna Bau Sathe) గురించి మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అన్నా బావు ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. ఆయనను భారతీయ గోర్కీగా అభివర్ణిస్తారు. ఆయన అగ్రశ్రేణి సాహితీకారుడు(Writer). 1920, ఆగస్టు 1వ తేదీన జన్మించిన అన్నా బావు 1969, జులై 18న కన్నుమూశారు. మహారాష్ట్రలోని సాంగీ జిల్లా వాఠేగావ్‌లో వావూ-వాలూబాయి దంపతులకు అన్నాబావు జన్మించారు.
చిన్నతనంలో ఈయనను తుకారం అని పిలిచేవారు. అన్నా
మహారాష్ట్ర(Maharastra) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్(BRS) అధినేత అన్నా బావు సాఠె(Anna Bau Sathe) గురించి మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అన్నా బావు ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. ఆయనను భారతీయ గోర్కీగా అభివర్ణిస్తారు. ఆయన అగ్రశ్రేణి సాహితీకారుడు(Writer). 1920, ఆగస్టు 1వ తేదీన జన్మించిన అన్నా బావు 1969, జులై 18న కన్నుమూశారు. మహారాష్ట్రలోని సాంగీ జిల్లా వాఠేగావ్‌లో వావూ-వాలూబాయి దంపతులకు అన్నాబావు జన్మించారు.
చిన్నతనంలో ఈయనను తుకారం అని పిలిచేవారు. అన్నాబావు మామ ఫకీరా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన ప్రభావం అన్నా బావుపై పడింది. అన్నా రెండో తరగతి వరకు చదివారని కొందరు అంటారు. లేదు ఏడో తరగతి వరకు చదివారని మరికొందరు అంటుంటారు. ఎక్కువగా చదువుకోలేదన్నది మాత్రం నిజం. బాల్యంలో ఉళ్లో జరిగే జాతరలలో పాల్గొని అక్కడి సంస్కృతీ సాహిత్యాలపై అవగాహన తెచ్చుకున్నారు. అలా సాహిత్యంపై ఏర్పడిన అభిరుచి వల్ల ప్రజా గేయాలు, ఒగ్గు కథలు, జానపద, పురాణ గాధలను ఆమూలాగ్రం చదివారు.
స్వాంతంత్ర్య సమరయోధుడు నానా పాటిల్ ఉద్వేగ ఉపన్యాసం ఆయనపై బలమైన ప్రభావం చూపింది. వారితో కలిసి అజ్ఞాతవాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది చూసి అన్నా బావు తల్లి బెంగపెట్టుకున్నారు. అప్పటికే బొంబాయిలో పని చేస్తున్న భర్త దగ్గరకు పిల్లలతో సహా వెళ్లారు. తండ్రికి చేదోడువాదోడుగా అన్నా బావు ఉండేవారు. ఆర్ధిక సహకారం కోసం నానా రకాల పనులు చేశారు. బట్టల మిల్లులోనూ పని చేశారు. ఆ సమయంలోనే మిల్లు కార్మికుల కోసం సంఘాలు వెలిశాయి. అన్నాబావుకు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది.
వారు ఆయనలోని సాహిత్య కళను గుర్తించారు. ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. ఆ కాలంలో ముంబాయిలో కమ్యూనిస్టుల సారథ్యంలో సభలు, సమావేశాలు, సమ్మెలు, ధర్నాలు జరిగేవి. గోడలపై రాతలు మొదలుకొని నినాదాలు చేసే వరకూ అన్నింటిలోనూ అన్నా బావు పాల్గొన్నారు. ఉద్యమం లో తన ఆలోచనా ధోరణి విస్తరించి సాహిత్య సాంస్కృతిక రంగాలలో అగ్రశ్రేణికి చేరాడు. అన్నా బావు రాసిన జగ్ బదల్ ఘాలునీ సాంగూన్ గేలే మలాభీమ్‌రావ్ గేయం చాలా ప్రసిద్ధి పొందింది.
ప్రపంచాన్ని మార్చివేయమని నాకు నా భీమ్‌రావ్ చెప్పి వెళ్ళాడు అని అర్థం. కుల వివక్ష పట్ల ఆయన అనేక పాటలు రాశారు. అవన్నీ అగ్రవర్ణాల దోపిడీ గుండెల్లో బుల్లెట్లలా తాకాయి. అందుకే అన్నాబావును ఒక రాజ కీయ కార్యకర్తగా కంటే గొప్ప సాహిత్యకారుడిగా ప్రజలంతా హృదయాలకు అద్దుకుంటారు. మొత్తం 32 నవలలు రాశారు. ప్రతీది గొప్పగానే ఉంటుంది. ఏడు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ బాక్సాఫీసు దగ్గర విజయం సాధించాయి. ఫకీరా నవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకుంది. 1947 లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ నిజాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బలమైన గీతాలతో, సంభాషణలతో తెలంగాణ పోరాటం అనే ఒగ్గుకథ రాశారు.