ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలోనే ఆయనతో చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ మేరకు 14 అంశాలతో ఓ వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలోని పలు పెండింగ్ సమస్యలు, విభజన హామీలు ఉన్నాయి.

ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలోనే ఆయనతో చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ మేరకు 14 అంశాలతో ఓ వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలోని పలు పెండింగ్ సమస్యలు, విభజన హామీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోందని, ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు పెండింగులోనే ఉన్నాయని ప్రధాని మోడీకి జగన్ గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని, వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరారు. గతంలో తాను ప్రస్తావించిన పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారనిత, ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి పురోగతి సాధించిందని గుర్తుచేశారు. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను వెంటనే విడుదల చేసేలా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని జగన్ కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని ఆక్షేపించరు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని ప్రధానికి తెలిపారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారన్నారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టు విషయలో కేంద్రం తగిన సహకారం అందిస్తే ఇది పూర్తవుతుందని జగన్ ప్రధానికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని, రెండేళ్లుగా ఈ నిధులు ఇవ్వలేదన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలని కోరారు.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story