బీఆర్‌ఎస్‌ అధినేత (BRS chief) కేసీఆర్‌ (KCR)ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM Jagan) పరామర్శించారు. తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌.. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు.

బీఆర్‌ఎస్‌ అధినేత (BRS chief) కేసీఆర్‌ (KCR)ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM Jagan) పరామర్శించారు. తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌.. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR), పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. తొంటికి శస్త్ర చికిత్స అనంతరం నందినగర్‌లోని (NandiNagar) తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య వివరాలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు.

Updated On 4 Jan 2024 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story