దేశం పేరును ఎవరైనా ఎలా మార్చగలరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. G-20 ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వ్రాయబడింది. ఈ విషయమై కేజ్రీవాల్ స్పందిస్తూ

CM Arvind Kejriwal Said How Can Anyone Change Name Of Country
దేశం పేరును ఎవరైనా ఎలా మార్చగలరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అన్నారు. G-20 ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా(President of India) అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్(President of Bharat) అని వ్రాయబడింది. ఈ విషయమై కేజ్రీవాల్ స్పందిస్తూ.. కూటమికి భారత్(Bharat) అని పేరు పెడితే భారత్ పేరు మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
140 కోట్ల మంది ఉన్న దేశం.. ఇది ఏ ఒక్క పార్టీది కాదు. రేపు I-N-D-I-A కూటమి పేరు భారత్‌గా మార్చామనుకోండి.. భారత్ పేరును కూడా మారుస్తారా.. అప్పుడు భారత్ పేరును బీజేపీగా మార్చుతారా..? ఇది ఎంత హాస్యాస్పదం సోదరా.. ఇది ఒక దేశం.. ఈ దేశానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మనది చాలా పురాతనమైన సంస్కృతి. కూటమికి I-N-D-I-A పేరు పెట్టుకోవడం వల్ల నాలుగు ఓట్లు తగ్గుతాయని బీజేపీ(BJP) ఫీలవుతోంది. ఓట్లు తగ్గుతాయి కాబట్టే దేశం పేరు మార్చుతున్నారు. ఇది దేశ ద్రోహం అంటూ వ్యాఖ్యానించారు.
నేను కూడా సనాతన ధర్మానికి చెందిన వాడిని.. ఆయన నాతో కూర్చున్నాడు. అతను కూడా సనాతన ధర్మానికి చెందిన వాడు. మీలో చాలా మంది సనాతన ధర్మానికి చెందిన వారు కూడా ఉంటారు. మనం ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలని ఉదయనిధి వివాదంపై స్పందించారు.
