ఢిల్లీలో(Delhi) దీపావళి(Deepavali) రోజున క్రాకర్స్(Crackers) కాల్చేందుకు ఎదురుచూస్తున్న ప్రజలకు షాక్ తగిలింది. దీపావళి రోజున అన్ని రకాల పటాకుల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది.

ఢిల్లీలో(Delhi) దీపావళి(Deepavali) రోజున క్రాకర్స్(Crackers) కాల్చేందుకు ఎదురుచూస్తున్న ప్రజలకు షాక్ తగిలింది. దీపావళి రోజున అన్ని రకాల పటాకుల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. దీంతో పాటు బేరియంతో బాణాసంచా తయారీ, వినియోగంపై దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ బాణాసంచా తయారీ, విక్రయ ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం, బాణసంచా తయారీదారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వాటి త‌యారీకి అనుమతి ఇవ్వాలని ఇరు వ‌ర్గాలు అభ్యర్థించాయి.

అయితే.. దేశంలో చాలా చోట్లా బేరియంతో కూడిన బాణసంచాపై నిషేధం విధించిన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నిషేదం ఉన్న చోట‌ బేరియంతో చేసిన క్రాకర్లను ఎవరూ కాల్చలేరు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మినహా అన్ని చోట్లా గ్రీన్ కాక‌ర్స్ కాల్చవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలావుంటే.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వలను నిషేధించింది. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. బాణాసంచా కాల్చడం ముఖ్యం కాదని గతంలో కోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

రాజధాని నగరంలో పటాకుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులను గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు అది పూర్తిగా నిషేధించబడిన‌ట్లు అర్థం. ఢిల్లీ పోలీసులు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వకుండా చూసుకోండి. ఎలాంటి లైసెన్స్‌లు ఇచ్చినా మా ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది.

Updated On 22 Sep 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story