కార్పొరేట్ చదువుల పుణ్యమా అంటూ మూడు సంవత్సరాలు రాకమునుపే ప్లే స్కూల్ కి పంపించేస్తున్నారు తల్లిదండ్రులు.. వీటిని క్యాష్ చేసుకుంటున్నా విద్యాసంస్థలు లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నాయి.. ఈ తరుణంలో కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. పిల్లలకి ఆరేళ్ళు నిండితేనే ఒకటవ తరగతి లో అడ్మిషన్ ఇవ్వాలంటూ కేంద్ర విద్య రాష్ట్రాలకి నిర్ణయాన్ని జారీ చేసింది . దేశం లో ని అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలంటూ […]
కార్పొరేట్ చదువుల పుణ్యమా అంటూ మూడు సంవత్సరాలు రాకమునుపే ప్లే స్కూల్ కి పంపించేస్తున్నారు తల్లిదండ్రులు.. వీటిని క్యాష్ చేసుకుంటున్నా విద్యాసంస్థలు లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నాయి.. ఈ తరుణంలో కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. పిల్లలకి ఆరేళ్ళు నిండితేనే ఒకటవ తరగతి లో అడ్మిషన్ ఇవ్వాలంటూ కేంద్ర విద్య రాష్ట్రాలకి నిర్ణయాన్ని జారీ చేసింది . దేశం లో ని అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలంటూ ఉత్తరువులు జారీ చేసింది.
పిల్లల చదువులు పునాది దశ నుండి బలోపేతం గా చేయడానికి కేంద్ర విద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మరింత ఉపయోగకరంగా ఉండబోతుంది. అతి చిన్న వయసులోనే పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తూ వారి పై మరింత ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ళ పాటు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ ,రెండేళ్ల పాటు ప్రైమరీ ఎడ్యుకేషన్ ,మొత్తం ఇలా ఐదు ఏళ్ళ విద్యాబ్యాసాన్ని పునాది దశలో విద్యార్థులకి అయిందివ్వాలని జాతీయ విద్య విధానం తెలుపుతుంది.
ప్రస్తుత విధానానికి మద్దతు దిశగా ప్రభుత్వ,ప్రైవేట్ అంగనవాడి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా తమ విధానాలని సవరించు లోవాల్సి ఉంటుంది ..అన్ని రాష్ట్రాలు.,మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యాసంస్థలాన్ని కూడా మూడేళ్ళ ప్రీస్కూల్ విధానానికి అనుగుణం గ సిద్ధం అవుతూ కేంద్రం అమలు చేయబోయే ఈ నూతన విద్య విదానానికి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది .. ఈ విధానాన్ని సవరించటం లో మద్దతు తెలుపకపోయినా ,వ్యతిరేక చర్యలకు పాల్పడి చిన్న వయసు పిల్లల్ని ప్రీస్కూల్ విధానం లో జోన్ చేసుకున్న స్కూల్ లైసెన్స్ రద్దు చేయటం వంటి కఠిన చర్యలు తప్పవని సూచించటం జరిగింది.