కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ మ్యూజికల్ ఛైర్ గేమ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఊహించడం కష్టమే అవుతోంది. రేసులో ఉన్న ఇద్దరూ గొప్పవారే. ఇద్దరికీ ఎమ్మెల్యేల అండ ఉంది. హైకమాండ్‌కు కూడా ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ మ్యూజికల్ ఛైర్ గేమ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఊహించడం కష్టమే అవుతోంది. రేసులో ఉన్న ఇద్దరూ గొప్పవారే. ఇద్దరికీ ఎమ్మెల్యేల అండ ఉంది. హైకమాండ్‌కు కూడా ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు. ముఖ్యమంత్రి రేసులో లిస్ట్‌లో ప్రయారిటీ క్యాండిడేట్‌లుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేదానిపై చర్చలతో హస్తిన హీటెక్కిపోతోంది. ఇవాళ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన శివకుమార్ నర్మగర్భంగా తనకే సీఎం పదవి ఇవ్వాలని హైకమాండ్‌కు సంకేతం పంపారు. సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను ఒంటరినని, ఒంటరిగానే పార్టీని గెలిపించానని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడ్డానన్నారు. గెలుపు కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం సహకరించారని పేర్కొన్నారు. తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు చెప్పడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది తానేనని అన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిపోయినా తాను నిబ్బరం కోల్పోలేదని చెప్పారు.
సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు వేడుకలకు సిద్ధరామయ్య కూడా హాజరయ్యారని తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నానని, సీఎల్పీ భేటిలో మెజార్టీ ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా కోరుకున్నారని సిద్ధరామయ్య తెలిపారు. అయినప్పటికీ అధినాయకత్వం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, డీకే శివకుమార్‌తో తనకు మంచి స్నేహం ఉందని 75 ఏళ్ల సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య వెంట దళిత, గిరిజన, మైనారిటీ, ఓబీసీ సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.