ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించేందుకు , బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు బ్యాంకుల విలీనం కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం .కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించేందుకు , బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు బ్యాంకుల విలీనం కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం .కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.ఇప్పటికే ఈ దిశగా చాలా బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనం,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం,ఇండియన్ బ్యాంక్‌ను అలహబాద్ బ్యాంక్‌‌తో విలీనం , పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోయాయి.ఇప్పుడు ఇదే జాబితాలో చేరనుంది సిటీబ్యాంక్ .ప్రయివేట్ బ్యాంకు రంగంలో అగ్రగామి అయిన Axis Bank లో వీలీనం కానుంది .

2021లో సిటీ గ్రూప్ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా భారత్‌తో సహామరో 13 దేశాల్లో కూడా రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయాన్ని తీసుకున్న తరుణంలో గతఏడాది మర్చి నుండి చర్చలు జరుగుతువుండగా తాజాగా AXISBANK సిటీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే విధంగా నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది . అమెరికాకు చెందిన సిటీ బ్యాంగ్ గ్రూప్ మన దేశంలో క్రెడిట్ కార్డ్‌లు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది.

ఇకపైన సిటీబ్యాంక్ వినియోగదారులు axis bank ద్వారా తమ బ్యాంకు సేవలని వినియోగించుకోవాల్సి ఉంటుంది. సిటీ బ్యాంకు వినియోదారుల క్రెడిట్ కార్డు కి సంబంధించి లావాదేవీల విషయంలో మాత్రం సమస్యల పరిష్కారానికి కొంతసమయం పడుతుంది అని స్పష్టం చేసారు . ఇతర సేవలైన లోన్స్,ఇన్సూరెన్ పాలిసీ వంటి వాటిలో పెద్దగా మార్పులు ఏమి ఉండబోవని స్పష్టం చేసింది .సిటీ బ్యాంకు వినియోగదారులు ఇకపైన axis bank atm లను వినియోగించుకోవచ్చు అని పేర్కొంది .ఈవిధంగ త్వరలో పూర్తి స్థాయి లో సిటీ బ్యాంకు వినియోగదారుల వ్యాపారాన్ని Axis Bank చేజిక్కించుకుంది .

Updated On 9 March 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story