నన్ను రక్షించండి.. నాకు ప్రాణహాని ఉంది.. దయచేసి నన్ను కాపాడండి అంటూ.. పోలీసులను(Police) ఆశ్రయించింది ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి వైష్ణవి ధనరాజ్. సీఐడీ(CID) సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి వైష్ణవి ధనరజ్(Vaishnavi Dhanraj). తన కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉంది అని చెపుతూ.. షాకింగ్ కామెంట్స్ చేింది. తనపై రోజు దాడి చేస్తున్నారని.. తనను శారీరకంగా హింసిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

సోషల్ మీడియా(Social media) వేదికగా ఆమె ఓ పోస్ట్ కూడా పెట్టారు. వీడియో బైట్ ను పోస్ట్ చేసిన వైష్ణవి.. ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్(Twitter) వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తనను కాపాడాలని..తన ఒంటిపై గాయాలను చూపిస్తూ వీడియో చేయడం కలకలం రేపింది. నాకు సాయం కావాలి. నేను కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో ముంబై లో(Mumbai) ఉన్నాను. నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడింది. నాతో దారుణంగా వ్యవహరించారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా బంధించారు. ఎలాగొలా తప్పించుకుని నేను బయట పడ్డాను అంటూ.. వేడుకుంది. న్యూస్ ఛానల్స్‌తో(News Channels) పాటూ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అని ఓ వీడియో పోస్ట్ చేసింది.
వీడియోలో తన నోరు, కుడిచేయి మణికట్టుపై ఉన్న గాయాలను కూడా ఆమె కెమెరాకు చూపించింది. దాంతో ఈ వీడియో వైరల్(Viral) అయ్యింది. ఇక ఈ విషయంలో పోలీసులు కూడా స్పందించారు. వైష్ణవి ఫిర్యాదు మేరకు తన కుటుంబసభ్యులపై కేసున నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వైష్ణవి 2016లో నటుడు నితిన్ షెరావత్‌ను(Nitin Sherawath) పెళ్లి చేసుకుని ఆ తరువాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో(Parents) కలిసి ఉంటోంది.తనపై తన తల్లీతండ్రులే దాడి చేశారని ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది.