నెల 26న గణతంత్ర దినోత్సవం(Republic day) సందర్భంగా నిర్వహించే రాష్ట్రపతి(President) తేనేటి విందుకు జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూపరాణికి(Chitla Swarooparani) ఆహ్వానం అందింది. 2021-22లో నీటి సమృద్ధి విభాగంలో జాతీయ పురస్కారం నెల్లుట్ల(Nellutla) గ్రామ పంచాయతీకి దక్కింది.
ఈనెల 26న గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోమ్ వేడుకలకు రావాలని స్వరూపారాణికి ఆహ్వానం అందింది.

President Droupadi Murmu
నెల 26న గణతంత్ర దినోత్సవం(Republic day) సందర్భంగా నిర్వహించే రాష్ట్రపతి(President) తేనేటి విందుకు జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూపరాణికి(Chitla Swarooparani) ఆహ్వానం అందింది. 2021-22లో నీటి సమృద్ధి విభాగంలో జాతీయ పురస్కారం నెల్లుట్ల(Nellutla) గ్రామ పంచాయతీకి దక్కింది.
ఈనెల 26న గణతంత్ర(Republic day) వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోమ్ వేడుకలకు రావాలని స్వరూపారాణికి ఆహ్వానం అందింది. కేంద్ర పంచాయతీ రాజ్ విభాగం నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ కమిషన్‌కు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి.
గతేడాది ఏప్రిల్ 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ సేవలకు సంబంధించి జాతీయస్థాయి పురస్కారాన్ని సర్పంచ్ స్వరూపరాణి అందుకున్నారు. తాజాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోమ్‌కు ఆహ్వానం రావడంతో తమ గ్రామ కీర్తి పతాక స్థాయిలో చేరిందని ఈ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, సర్పంచ్ కృషి వల్లే తమకు ఇంతటి గౌరవం దక్కిందని స్థానికులంటున్నారు. దేశ వ్యాప్తంగా 8 మంది సర్పంచులకు మాత్రమే ఈ అవకాశం దక్కగా, ఇందులో నెల్లుట్ల సర్పంచ్‌కు స్థానం దక్కడం గమనార్హం.