కట్టుబట్టలు, రూ.300తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ముంబైలోని రైల్వే స్టేషన్‌లో రెండు రోజులు గడిపింది.
సంకల్పం ఉన్నప్పుడు, మార్గం ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న చిను కాల జీవితానికి ఈ సామెత సరిపోతుంది. చిను కలా(Chinu kala) తల్లి ఏడాది వయసులో ఆమెను వదిలి సౌదీ అరేబియా(Saudi arabia) వెళ్లింది. తల్లి పోయిన తర్వాత చిను తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా 15 ఏళ్ల వయసులో చిను ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కట్టుబట్టలు, రూ.300తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ముంబైలోని రైల్వే స్టేషన్‌లో రెండు రోజులు గడిపింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ లొంగలేదు. సెయింట్ అలోసియస్‌లో 10వ తరగతి చదువుతున్నప్పుడే చిను జీవితం మలుపు తిరిగింది. కుటుంబ కలహాల కారణంగా స్వదేశాన్ని వదిలి బతుకుదెరువు కోసం కత్తులు, కోస్టర్లు అమ్మడం ప్రారంభించింది. అప్పుడు ఆమె రోజు సంపాదన కేవలం 20 రూపాయలే.
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత గ్లాడ్రాగ్స్ మిస్ ఇండియా(Miss India) బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం రావడంతో చిను జీవితం యూ-టర్న్ తీసుకుంది. పది ఫైనలిస్టుల్లో ఆమెకు చోటు దక్కింది. మోడల్‌గా నటిస్తూ బాగానే డబ్బు సంపాదించింది. 2004లో అమిత్ కాలాతో(Amith kala) వివాహం జరిగింది. 2014లో చిను కాలా రూ.3 లక్షల ప్రారంభ పెట్టుబడితో రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ 10 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించింది. దేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. 2018 నాటికి, చిను కాలా తన కంపెనీని బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలో స్థాపించింది. ఈరోజు ఆమె ఆభరణాల బిజినెస్ రూ.100 కోట్లకు చేరింది. లగ్జరీగా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. చిన్నచిన్న కారణాలకే జీవితానికి చరమాంకం పలుకుతున్న ఈరోజుల్లో.. బాల్యం నుంచే కష్టాలు పడ్డ చిను కాల జీవితం ఆదర్శంగా నిలుస్తోందని చెప్తున్నారు.