మాజీ లోక్‌సభ సభ్యుడు చింతా మోహన్(chintha Mohan) గుర్తున్నారా? కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన ఈయన ఇప్పుడు మరోసారి తిరుపతి(tirupathi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. జనాలందరూ మర్చిపోయిన ఈయన తన హాస్యచతురతతో మళ్లీ పది మంది దృష్టిలో పడ్డారు. ఆయనో బ్రహ్మాండమైన జోక్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu Naidu) భారీ విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నారట!
మాజీ లోక్‌సభ సభ్యుడు చింతా మోహన్(chintha Mohan) గుర్తున్నారా? కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన ఈయన ఇప్పుడు మరోసారి తిరుపతి(tirupathi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. జనాలందరూ మర్చిపోయిన ఈయన తన హాస్యచతురతతో మళ్లీ పది మంది దృష్టిలో పడ్డారు. ఆయనో బ్రహ్మాండమైన జోక్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu Naidu) భారీ విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నారట! జగన్మోహన్‌రెడ్డిపై(Jagan Mohan Reddy) ఈర్షాసూయలు ఉన్న ప్రతీ ఒక్కరు చెప్పేమాటే ఇది! మరి చింతా మోహన్ చెప్పింది జోకేలా అవుతుందనేగా మీ డౌటనుమానం! ఆయన ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీతో(BJP) పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి లభించే సీట్లు తగ్గుతున్నాయట! నరేంద్రమోదీతో(Narendra modi) పొత్తు లేకపోయి ఉంటే మాత్రం బంపర్ మెజారిటీ వచ్చేదట! టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఈజీగా 150 స్థానాల కంటే ఎక్కువ గెల్చుకునేదని చింతా మోహన్ చెబుతున్నారు. మోదీతో చేయి కలపవడం వల్ల కొన్ని సీట్లు తగ్గబోతున్నాయే తప్ప అధికారంలో రావడం మాత్రం పక్కా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు గెలుస్తారని చెప్పకుండా జగన్ గెలుస్తారని ఎలా అంటారు? ఎలా అనగలరు? షర్మిల అయినా, చింతా మోహన్ అయినా మరోక కాంగ్రెస్ నాయకుడైనా ఇలాగే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్‌కు చంద్రబాబు బోల్డంత ఫండింగ్ చేశారన్న టాక్ వినిపిస్తున్నది కాబట్టి. చంద్రబాబు ఉప్పు తిన్న తర్వాత ఆ మాత్రం విశ్వాసంగా ఉండకపోతే ఎలా?