చైనా(China) ఓ పక్క పాతాళ కుహరంలోకి చొచ్చుకువెళుతూనే, మరోపక్క నింగిలోకి రయ్యిమంటూ దూసుకెళ్లింది. రెండు బృహత్తర సైన్స్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళుతున్న సమయంలోనే షింజియాంగ్ ప్రావిన్స్‌లో అంత్యంత లోతైన బోర్ తవ్వకం మొదలయ్యింది.
చైనా(China) ఓ పక్క పాతాళ కుహరంలోకి చొచ్చుకువెళుతూనే, మరోపక్క నింగిలోకి రయ్యిమంటూ దూసుకెళ్లింది. రెండు బృహత్తర సైన్స్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళుతున్న సమయంలోనే షింజియాంగ్ ప్రావిన్స్‌లో అంత్యంత లోతైన బోర్ తవ్వకం మొదలయ్యింది. ఈ రంధ్రం లోతు ఇంచుమించు పది కిలోమీటర్లు ఉంటుంది. భూగర్భాన్వేషణలో భాగంగానే తవ్వకాన్ని మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు. రంధ్రం తవ్వడమే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సున్ జింషెంగ్ ఏం చెబుతున్నారంటే 'ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్టు చాలా కఠినమైనది. ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించడం ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం' అని చెప్పారు. భూమి అడుగున పది రాతి పొరలను చీల్చుకుంటూ తవ్వకాలు సాగనున్నాయి.
ఇది దాదాపు 145 మిలియన్ సంవత్సరాల వయసున్న క్రకెటెషియస్ పొరను చేరుకోనున్నాయి. ఇప్పటికే 2021లో భూగర్భ అన్వేషణను చైనా అధ్యక్షుడు అభినందించారు.
రోదసిలోకి వెళ్లిన ముగ్గురు వ్యోమగాములలో చైనాకు చెందిన గుయ్ హైచావో కూడా ఉన్నారు. ఈ త్రయం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది. చైనా అంతరిక్ష కార్యక్రమంలో ఇది కీలక పరిణామం. షెంజౌ-16 వ్యోమనౌకలో ఈ ముగ్గురు రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్-2 ఎఫ్ రాకెట్ దీన్ని మోసుకెళ్లింది. ఖనిజసంపద, ఇంధన వనరులను పసిగట్టడమే కాదు, భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును కూడా ముందే పసిగట్టవచ్చని జింగ్‌పింగ్ అన్నారు. ప్రపంచంలోనే మనుషులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్ డీప్ బోర్‌హోల్‌గా దీనిని పిలుస్తారు. 1969లో తవ్వడం మొదలు పెడితే 1989లో ఇది పూర్తయ్యింది. మొత్తం 12,262 మీర్ల లోతు రంధ్రాన్ని తవ్వారు.