కోల్‌కతాలోని(Kolkata) టాంగ్రా(Tangra) ప్రాంతంలో భారతదేశం(Indian), చైనా(china) ప్రజలు సమ్మిళితంగా ఉంటారు. కోల్‌కతాలోని చురుకైన టాంగ్రా ప్రాంతంలో రెండు సంస్కృతులు మిళితమై ఉండే ప్రత్యేక ప్రదేశం. చాలా కాలం క్రితం ఓ పెద్ద చెట్టు దగ్గర రెండు రాళ్లు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు వాటిపై ఎర్రని పొడిని పూసి ప్రతిరోజూ ప్రార్థనలు చేసేవారు.

కోల్‌కతాలోని(Kolkata) టాంగ్రా(Tangra) ప్రాంతంలో భారతదేశం(Indian), చైనా(china) ప్రజలు సమ్మిళితంగా ఉంటారు. కోల్‌కతాలోని చురుకైన టాంగ్రా ప్రాంతంలో రెండు సంస్కృతులు మిళితమై ఉండే ప్రత్యేక ప్రదేశం. చాలా కాలం క్రితం ఓ పెద్ద చెట్టు దగ్గర రెండు రాళ్లు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు వాటిపై ఎర్రని పొడిని పూసి ప్రతిరోజూ ప్రార్థనలు చేసేవారు. ఈ సమయంలోనే ఓ చైనీస్ కుర్రాడు అనారోగ్యం పాలయ్యాడు. ఇతనికి ఎన్ని మందులు ఇచ్చినా రోగం నయం కాలేదట. దీంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు ఆ రాళ్ల వద్ద బాలుడిని ఉంచి కాళీ దేవిని ప్రార్థించారు. దీంతో ఆ కుర్రాడు అనారోగ్యం నుంచి బయటపడ్డాడని చెప్తారు. కాళీ మాత ఆశీర్వాదం వల్లే తమ కుమారుడు జీవించాడని ఆ ప్రదేశంలో చైనీస్‌ కుర్రాడి తల్లిదండ్రులు ఆలయాన్ని నిర్మించారు. ఇది చైనీస్‌ కాళీ దేవాలయమని(chinnese Kali Temple) కూడా పిలుస్తారు. లోపల కాళికా మాత, శివుడి విగ్రహాలు ఉంటాయి. వీటికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడ దేవుళ్లకు నైవేద్యంగా నూడుల్స్‌, ఇతరత్రా చైనీస్‌ వంటకాలను పెడతారు.

గుడి నిర్మించేందుకు చైనీస్ కమ్యూనిటీ సభ్యులు నిధులను అందించారు. ఈ ఆలయం రెండు సంస్కృతుల మధ్య సామరస్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ గర్వంగా నిలిచిందని చెప్తున్నారు. ఆలయంలో శనివారాల్లో కాళీ మాతకు పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తారు. దీపావళి సమయంలో, ఆలయం కొవ్వొత్తులతో ప్రకాశిస్తుంది. అయితే వారు చెడు ఆత్మలను నివారించడానికి ప్రత్యేక ధూపం మరియు కాగితాన్ని కూడా కాల్చుతారు.
ఇక్కడి విగ్రహం ముందు ప్రజలు నమస్కరించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా నమస్కరించే శైలికి బదులుగా, వారు దేవత ప్రత్యేక భక్తి భావంతో పూజలు నిర్వహిస్తారు.

Updated On 21 May 2024 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story