China : అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు
పొగురుదేశం చైనా(China) తన పొగరు చూపిస్తూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మళ్లీ మళ్లీ చెబుతోంది. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో(Arunachal Pradesh) 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను విడుదల చేసింది చైనా.
పొగురుదేశం చైనా(China) తన పొగరు చూపిస్తూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మళ్లీ మళ్లీ చెబుతోంది. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో(Arunachal Pradesh) 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను విడుదల చేసింది చైనా. ఇందుకు సంబంధించి చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రాంతాల పేర్లు విదేశీ భాషలో ఉండటం చైనా ప్రాదేశికతకు హాని కలిగించవచ్చు. చైనా సార్వభౌమత్వ హక్కులను నేరుగా ప్రస్తావించకూడదు, అధికారం లేకుండా అనువాదం చేయకూడదు’ అని ఆ ప్రకటనలో చైనా తెలిపింది. భారత ప్రధాని మోదీ(Narendra Modi) ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో సైనికులను వేగంగా తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగాన్ని జాతికి అంకితం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన విడుదల చేసింది. చైనా నాలుగో జాబితాను భారత్ ఖండించింది. అరుణాచల్ తమ దేశ అంతర్భాగమని పేర్లను మార్చడం ద్వారా వాస్తవాలను మరుగు పరచలేరని స్పష్టం చేసింది.