☰
✕
యూ ట్యూబ్ చూసి బాంబు తయారు చేసిన పిల్లలు..
x
యూట్యూబ్‌లో(Youtube) వచ్చే వీడియోలు మంచిని చెబుతున్నాయా? చెడును నేర్పిస్తున్నాయా? అంటే చెప్పడం కష్టం కానీ, చెడు మాత్రం ఈజీగా మెదడులో దూరిపోతుంది. బీహార్‌లోని(Bihar) ముజఫర్‌పూర్(Mujafarpur) జిల్లాలో ఇలాగే యూట్యూబ్ చూసి పిల్లలు(Children) బాంబు(Bomb) తయారు చేశారు. అగ్గిపుల్లల నుంచి గన్‌పౌడర్‌ను(Gun Powder) తీసి, దాన్ని ఓ టార్చిలైట్‌లో(Torch light) పోశారు. తర్వాత ఓ బ్యాటరీని అనుసంధానం చేసి, టార్చిలైట్ స్విచ్ ఆన్ చేశారు. దాంతో అది ఢామ్మని పేలింది. అదృష్టం బాగుండబట్టి ప్రాణాలు పోలేదు కానీ, ఓ బాలుడికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు గయాఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
Eha Tv
Next Story