Chikoti Praveen : కిషన్ రెడ్డిని కలిసిన చికోటి ప్రవీణ్
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని(Kishan Reddy) గురువారం ఢిల్లీలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్(Chikoti Praveen) కలిశారు. వీరి భేటీలో అంబర్‌పేట శంకర్(amberpet Shankar) కూడా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న చికోటి ప్రవీణ్.. వరుసగా తెలంగాణ బీజేపీ ప్రముఖులను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ(BJP) తరపున పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న చికోటి ప్రవీణ్..

Chikoti Praveen
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని(Kishan Reddy) గురువారం ఢిల్లీలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్(Chikoti Praveen) కలిశారు. వీరి భేటీలో అంబర్‌పేట శంకర్(amberpet Shankar) కూడా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న చికోటి ప్రవీణ్.. వరుసగా తెలంగాణ బీజేపీ ప్రముఖులను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ(BJP) తరపున పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న చికోటి ప్రవీణ్.. పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. హిందు ధర్మం, గో రక్షక్ నినాదంతో ముందుకు వెళ్తున్న చికోటి ప్రవీణ్.. ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే గతంలోనూ బీజేపీ సీనియర్ నేతలు డీకే.అరుణ, రాం చందర్ రావు, బండి సంజయ్ లతో భేటీ అయ్యారు.
