మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra assembly elections) దగ్గరపడ్డాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra assembly elections) దగ్గరపడ్డాయి. ఓటర్లకు(Voters) గాలం వేసే పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath shinde) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబాయికి వెళ్లే మార్గంలోని అయిదు టోల్‌బూత్‌ల(toll booth) దగ్గర లైట్ మోటార్ వాహనాలకు(Light motar vehicles) టోల్‌ఫీజు రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సోమవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. టోల్ మినహాయింపు ఇవాళ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దహిసర్, ములుంద్, ఐరోలి, తిన్హంత్, వాషి .. ఈ అయిదు టోల్ బూత్‌ల దగ్గర లైట్ మోటార్ వాహనదారులు టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. టోల్ కట్టకుండానే వీటి గుండా ముంబాయిలోకి ఎంటర్ అవ్వొచ్చు. ప్రస్తుతం ఇక్కడ టోల్ పీజు 45 రూపాయలు ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో మహారాష్ట్రలోని ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ముంబాయికి వెళ్లే ప్రజలకు ప్రయోజనకరం కానుంది. కార్లు, ఎస్‌యూవీ వాహనాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. బస్సులు, లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులు టోల్ కట్టాల్సిందే. రోజూ 6 లక్షలకు పైగా వాహనాలు ముంబాయికి రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో 80 శాతం తేలికపాటి మోటారు వాహనాలే కావడం గమనార్హం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముంబాలో 55 ఫ్లైఓవర్‌లను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్లకు అయిన ఖర్చును రాబట్టుకునేందుకు మొదటగా నగర ప్రవేశాల దగ్గర టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వంతెనల నిర్మాణం తుది దశకు చేరుకోగానే టోల్ బూత్‌ల నిర్మాణానికి 1999లో టెండర్లు వేశారు. 2002లో మొత్తం అయిదు టోల్ బూత్‌లను ప్రారంభించారు. అప్పటి నుంచి ముంబాయిలోకి ప్రవేశించే వాహనాలకు ఈ అయిదు టోల్ బూత్‌ల ద్వారా ఫీజు వసూలు చేస్తున్నారు. నిజానికి ఈ నిర్వహణ డబ్బు మొత్తం పదేళ్ల కిందటే రికవరీ అయ్యింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం టోల్ వసూలు చేస్తూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం లాస్టియర్ టోల్ ట్యాక్స్ రికవరీని మరో మూడేళ్లపాటు అంటే 2027 వరకూ పొడిగించింది. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, శివసేనకు చెందిన కొందరు నాయకులు ముంబాయి బూత్‌లన్నింటిలోనూ టోల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.