ఆధునిక సమాజంలో సోషల్ మీడియా(Social Media) ప్రస్తావనం అంతా ఇంతా కాదు. రాకెట్ కంటే వేగంగా సోషల్ మీడియా సమాజంలో దూసుకెళ్తుంది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిందీ సోషల్ మీడియా. కొందరు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని సొసైటీలో పైకి వచ్చారు. ఎందరో సెలబ్రిటీలుగా మారారు. కొందరు అయితే అమాంతంగా ఎదిగిపోయారు. కానీ కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలంటూ సమాజంలో చిచ్చు పెడుతున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(Chief Justice Of India) ప్రస్తావించారు. సోషల్ మీడియా సైట్లు అసహన సమాజాన్ని సృష్టించాదని భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్(Chandrachud) వ్యాఖ్యానించారు. ప్రపంచంలో సోషల్ మీడియా చిచ్చు పెడుతుందన్నారు. ఈ సామాజిక మాధ్యమాల వల్ల సమాజంలో విభజన వస్తుందని, ద్వేషాన్ని నింపుతుందని ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై యువత లోతుగా ఆలోచించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. సమాజానికి అత్యాధునిక సాంకేతికత మంచిదే కానీ దానిని దుర్వినియోం చేస్తే వచ్చే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.