సహజీవనం.. ఇందులో మంచి చెడుల జోలికి వెళ్లడం లేదు కానీ కొందరు యువతీయువకులు లివి ఇన్‌(Live-in) రిలేషన్‌కే ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. పెళ్లికి ఎందుకో విముఖత చూపుతున్నారు. నిజానికి సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు.

సహజీవనం.. ఇందులో మంచి చెడుల జోలికి వెళ్లడం లేదు కానీ కొందరు యువతీయువకులు లివి ఇన్‌(Live-in) రిలేషన్‌కే ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. పెళ్లికి ఎందుకో విముఖత చూపుతున్నారు. నిజానికి సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. పెళ్లికి ముందు మరో వ్యక్తితో కలిసి ఉండటాన్ని మన సమాజం కూడా అంగీకరించదు. కానీ చత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బస్తర్‌ జిల్లాలో(Bastar District) ఉండే మురియా తెగ ప్రజలు(tribes) మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. యువతీ యువకులను సహజీవనం చేసేలా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు.

పైగా ఈ ప్రాంతపు ప్రజలందరూ సహజీవనానికే మద్దతు పలుకుతుంటారు. తెగ ప్రజలంతా కలిసి వెదురుతోనో(Bamboo), మట్టితోనో ఓ గుడిసెను నిర్మిస్తారు. గ్రామానికి చెందిన యువతీ యువకులంతా అక్కడికి వచ్చి ఆటపాటలతో సరదాగా గడపుతారు. అబ్బాయిలేమో వెదురుతో ఆకట్టుకునే రీతిలో దువ్వెనలు(Comb) తయారు చేస్తారు. ఇందులో క్రియేటివిటీ కనిపిస్తుంటుంది. ఇక ఆటపాటలప్పుడు అమ్మాయికి ఏ అబ్బాయన్నా నచ్చాడనుకోండి.. ఆమె అతడు తయారుచేసిన దువ్వెనను దొంగలిస్తుంది.

ఆ విధంగా తన ప్రేమను వ్యక్తపరుస్తుందన్నమాట! అతడు ప్రేమకు ఓకే చెబుతాడు. తర్వాత వారిద్దరు కలిసి అదే గుడిసెలో కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తారు. దీనిని వారు ఘోతుల్‌గా పిలుస్తారు. ఆ జంట శారీరకంగా, మానసికంగా దగ్గరవుతారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దలు మంచి ముహూర్తం చూసి వారిద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లిబంధంతో ఒక్కటైన ఆ జంట చివరివరకు కలిసే ఉంటుంది.

జార్ఖండ్‌లోని కొర్వా తెగ ప్రజలు కూడా సహజీవనానికికే పెద్దపీట వేస్తుంటారు. పెళ్లి చేసుకోకుండా తమకు నచ్చిన వ్యక్తితో జీవితాంతం లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. చాలా తక్కువ మందే 40 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత విడిపోతుంటారు. పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం కూడా ఉంది. వీరి ఆర్ధిక స్థోమత అంతంత మాత్రమే! అందుకే ఆర్భాటపు పెళ్లి జోలికి వెళ్లకుండా కలిసి ఉంటుంటారు.

ఆ వ్యక్తితోనే పిల్లలను కంటారు. ఆ వ్యక్తితోనే కష్టసుఖాలు పంచుకుంటారు. పెళ్లి జరగదంతే కానీ భార్యభర్తల్లాగే జీవిస్తారు. ఈ రకమైన సంప్రదాయాన్ని ధుకు వివాహం(Duku Marriage) అని అంటారు. సహజీవనంలో ఉండే అమ్మాయిని ధుకుని అని, అబ్బాయిని ధుకువా అని పిలుస్తారు.

Updated On 27 Oct 2023 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story