ఒకప్పుడు ఉపాధ్యాయ(Teacher) వృత్తి అంటే ఎంతో గౌరవం ఉండేది. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయులకే మనం ఇస్తాం. మనకు విద్యాబుద్దులు నేర్పించిన గురువులను సన్మానించడం చూస్తుంటాం. గురువులను సాక్షాత్తు దేవుడితో పోల్చుతాం.

ఒకప్పుడు ఉపాధ్యాయ(Teacher) వృత్తి అంటే ఎంతో గౌరవం ఉండేది. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయులకే మనం ఇస్తాం. మనకు విద్యాబుద్దులు నేర్పించిన గురువులను సన్మానించడం చూస్తుంటాం. గురువులను సాక్షాత్తు దేవుడితో పోల్చుతాం. కానీ ఈ మధ్య కాలంలో గురువులు చేసే ఆగడాలు హద్దు మీరుతున్నాయి. కొందరు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. మహిళా టీచర్లు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, మందు(Alcohol) తాగి స్కూల్‌కు రావడం, విద్యార్థులతో చాకిరి చేయించడం చూస్తున్నాం. ఈ తరహాలోనే మరో ఘటన బయటపడింది. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా బడికే మందు బాటిల్‌ను తెచ్చుకొని స్టాఫ్‌ రూమ్‌లో గ్లాస్‌లో మద్యం పోసుకొని తాగాడు. ఆ సమయంలో ఆ స్కూల్‌ మహిళా ప్రిన్సిపల్‌(Principle) ఎదుటే ఈ దురాగాతానికి ఆ ఉపాధ్యాయుడు ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించిన వీడయో ఇప్పుడు వైరలవుతోంది. వివరాలు చూస్తే..

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రం బిలాస్‌పూర్(Billaspur) జిల్లాలోని మస్తూరి బ్లాక్ ఏరియాలోని మచాహా ప్రైమరీ స్కూల్‌లో
ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా ప్రిన్సిపల్ ముందు బహిరంగంగా సంతోష్ కుమార్ కేవత్(Santhosh kumar kevat) అనే టీచర్ మద్యం సేవించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే మద్యం సేవిస్తుంటే మరో ఉపాధ్యాయుడు ఆపడానికి ప్రయత్నించినా సంతోష్‌కుమార్‌ ఆగలేదు. అతని మాట లెక్కచేయకపోవడమే కాకుండా తిరిగి అతడినే దూషిస్తూ చేబులో నుంచి బాటిల్ బయటకు తీసి తన ఎదురుగా ఉన్న టేబుల్‌పై పెట్టుకున్నాడు. ప్లాస్టిక్ గ్లాస్‌లో మద్యం పోసుకొని మంచినీళ్లు కలుపుకొని గుట్టుకున్న మింగాడు. నేను ప్రతిరోజూ తాగుతా. నా సమస్యలు నాకున్నాయి. నువు తాగుతావా అంటూ తోటి ఉపాధ్యాయుడిని ఎదురు ప్రశ్నించాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నేనెవరికీ భయపడను అంటూ వీడియో తీస్తున్న తోటి ఉపాధ్యాయుడిని కూడా హెచ్చరించాడు. ఈ విషయంపై ప్రధాన ఉపాధ్యాయురాలు తులసీ చౌహాన్ మాట్లాడుతూ.. స్కూల్‌లో సంతోష్‌ కుమార్‌ చేసిన ఈ పని నీచమైంది, హేయమైనది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవో టీఆర్‌ సాహుకు సమాచారం అందించామని తులసీ చౌహాన్‌ వివరించారు.
అతడి చర్యపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. టీచర్ సంతోష్‌ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Updated On 1 March 2024 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story