ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్‌లో 30 ఏళ్ల వ్యక్తి లోక్‌సభ ఎన్నికల్లో
ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్‌లో 30 ఏళ్ల వ్యక్తి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ సాధించిన తర్వాత తన వేలిని కోసుకుని ఆలయంలో కాళీమాతకు సమర్పించాడు. జూన్ 4న, లోక్‌సభ ఎన్నికల తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉందని తెలుసుకున్న బీజేపీ మద్దతుదారుడైన దుర్గేష్ పాండే బాధ లోకి వెళ్లిపోయారు. అనంతరం కాళీ ఆలయానికి వెళ్లి బీజేపీ విజయం కోసం ప్రార్థనలు చేశారు.
బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, ఎన్డీఏ 272 మెజారిటీ మార్కును దాటడం చూసిన పాండే ఎంతో సంతోషించి మళ్లీ కాళీ ఆలయానికి వెళ్లి అక్కడ తన ఎడమ చేతి వేలిని కోసి అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత గాయానికి గుడ్డ కట్టి రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించారు. పరిస్థితి తీవ్రత కారణంగా అతని కుటుంబసభ్యులు అతన్ని సమారిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు, ఆ తర్వాత అంబికాపూర్ మెడికల్ కాలేజీకి పంపించారు. దురదృష్టవశాత్తు, చికిత్సలో జాప్యం కారణంగా అతని వేలు తెగిపోయిన భాగాన్ని తిరిగి అతికించలేకపోయారు. పాండే పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.