వర్ణ వివక్ష అంటే కుల వివక్షనే కాదు, రంగును బట్టి కూడా వివక్ష చూపిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఒకడు ఇలాగే తన భార్య(Wife) నలుపురంగులో ఉంది కాబట్టి విడాకులు(Divorce) కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు(High Court) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చర్మం రంగు ఆధారంగా వివక్ష చూపడం తగదని, ఇలాంటి జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని తెలిపింది. విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ సదరు మొగుడిని గట్టిగా చివాట్లు వేసింది.
వర్ణ వివక్ష అంటే కుల వివక్షనే కాదు, రంగును బట్టి కూడా వివక్ష చూపిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఒకడు ఇలాగే తన భార్య(Wife) నలుపురంగులో ఉంది కాబట్టి విడాకులు(Divorce) కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు(High Court) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చర్మం రంగు ఆధారంగా వివక్ష(Racism) చూపడం తగదని, ఇలాంటి జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని తెలిపింది. విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ సదరు మొగుడిని గట్టిగా చివాట్లు వేసింది. తన భార్య తనను వదిలిపెట్టి వెళ్లిపోయింది కాబట్టే విడాకులు అడుగుతున్నానని భర్త కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ భార్య మాత్రం అసలు విషయం చెప్పింది. రంగు తక్కువగా ఉన్నానన్న కారణంగా రోజూ అవమానించేవాడని, ఓ రోజు ఇంటి నుంచి వెళ్లగొట్టాడని న్యాయస్థానానికి తెలిపింది. 2005లో వీరిద్దరి పెళ్లి అయ్యింది. రంగును బట్టి ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడడం నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. మనుషులు మారాల్సిన అవసరం ఉందని, చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించకూడదని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా భాగస్వాముల ఎంపికలో చర్మం రంగు పోషించే పాత్రపై అధ్యయనాలను, ఫేయిర్ నెస్ క్రీములపై కూడా కోర్టు సుదీర్ఘ చర్చలు జరిపింది. ఫెయిర్‌స్కిన్‌ను ప్రమోట్ చేసే ప్రకటనలకు అయిదేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.