ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సీఎం భూపేశ్ బఘేల్‌పై(CM Bhupesh Baghel) కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్ర విమర్శలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల సాయంతో కాంగ్రెస్(Congress) ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల(Chhattisgarh Election manifesto) వేళ మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement direcrf) సంచలన విషయం వెల్లడించింది. బెట్టింగ్

Chhattisgarh CM Bhupesh Baghel
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సీఎం భూపేశ్ బఘేల్‌పై(CM Bhupesh Baghel) కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్ర విమర్శలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల సాయంతో కాంగ్రెస్(Congress) ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల(Chhattisgarh Election Manifesto) వేళ మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement direcrf) సంచలన విషయం వెల్లడించింది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సీఎం భూపేష్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల సాయంతోనే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల్లో పోరాడుతోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రచారం కోసం నిధులు సమకూర్చేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న స్మృతి ఇరానీ, సీఎం ప్రచారానికి బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగించడం ఆందోళన చెందాల్సిన విషయం.. ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. అధికారంలో ఉండగా ఆయన బెట్టింగ్ గేమ్ ఆడారు అని అన్నారు.
యూఏఈ నుంచి వచ్చిన అసిన్ అనే క్యాష్ కొరియర్ నుంచి రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేసిన్నట్లు ఈడీ తెలిపింది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ప్రచారం కోసం భారీ మొత్తంలో నగదును అందించేందుకే మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఈ వ్యక్తిని పంపిన్నట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. అసిన్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ జరిపింది. యాప్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు రూ.508 కోట్లు సీఎంకు అందినట్లు వెల్లడించింది. ఆ డబ్బును బఘేల్ అనే రాజకీయ నేతకు అందించాల్సి ఉందని ఆ కొరియర్ ఒప్పుకొన్నట్లు ఈడీ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. సీఎం భూపేశ్ బఘేల్‌పై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. జల ముందు సీఎం ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అందుకే కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
