ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) భిలాయ్-దుర్గ్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తకు దుర్గ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. తన భార్యతో(Wife) అసహజ శృంగారానికి బలవంతం చేసి మానసిక, శారీరకంగా వేధించడమే కాకుండా.. అదనపు కట్నం(Dowry) తేవాలని ఒత్తిడికి గురిచేసినందుకు వ్యాపారవేత్తకు ఈ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

2007లో ఈ జంటకు వివాహం జరిగింది. పెళ్లి నాటి నుంచే భార్యను అసహజరీతిలో(Unnatural) సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేయడం అందుకు ఆమె అంగీకరించకపోవడంతో చేయిచేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అన్‌ నేచురల్‌ సెక్స్‌లో పాల్గొనలాని వేధించేవాడని, దానికి అంగీకరించకపోవడంతో కొట్టేవాడని, అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలని హింసించేవాడని మహిళ వెల్లడించింది. 2016లో తన కూతురును(Daughter) తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ మహిళ.. తన భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ సెక్షన్‌ 377 కింద కేసును నమోదు చేశారు. దీంతో విచారించిన కోర్టు.. మహిళ ఆరోపణలతో ఏకీభవించింది. నేరం నిరూపించబడడంతో వ్యాపారవేత్తకు(Businessmen) శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమే కాకుండా వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో అతని తల్లిదండ్రులకు కూడా 10 నెలల జైలు శిక్ష విధించారు.

Updated On 27 Dec 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story