ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలిపారు.
బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్‌లకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి.
''బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ఏరియాలో అనుమానిత మావోయిస్టుల కదలికలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న తరువాత, భద్రతా బలగాలకు చెందిన సంయుక్త బృందం ఆపరేషన్ కోసం వెళ్లింది. అక్కడే ఆదివారం అనుమానిత మావోయిస్టులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు.'' పోలీసు అధికారి చెప్పారు.
ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో తెలంగాణ చెందిన ముఖ్య నేతలు ఉన్నట్లుగా సమాచారం...
తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు చనిపోయి ఉండవచ్చని పోలీసుల అనుమానం.. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్న అధికారులు. .. పెద్ద ఎత్తున ఏకే 47 లు దొరకడంతో అనుమానాలకు తావిస్తున్న అధికారులు.
