చెన్నైలో(Chennai) ఎయిర్‌పోర్టులో(Airport) ఓ యూట్యూబర్ ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అందులో పనిచేసేందుకు ఏడుగురిని నియమించుకున్నాడు.
చెన్నైలో(Chennai) ఎయిర్‌పోర్టులో(Airport) ఓ యూట్యూబర్ ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అందులో పనిచేసేందుకు ఏడుగురిని నియమించుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో షాప్ ఏర్పాటు చేయాలని గోల్డ్ స్మగ్లింగ్(Gold smugling) సిండికేట్ సూచన మేరకు అక్కడ ఓ షాప్ నిర్వహించడం ప్రారంభించాడు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) జారీ చేసిన గుర్తింపు కార్డులను మొత్తం ఎనిమిది మంది సభ్యులకు ఉండడంతో వీరిపై ఎవరికీ అనుమానం రాలేదు. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులుకే ఈ గుర్తింపు కార్డులు ఉండడంతో వీరిని ఎవరూ తనిఖీ చేయకపోయేవారు.
మహ్మద్ సబీర్ అలీ అనే యూట్యూబర్‌ను గోల్డ్ సిండికేట్ నియమించుకుంది. శ్రీలంక నుంచి వచ్చిన దొంగ బంగారమే లక్ష్యంగా అలీ ముఠా పనిచేస్తోంది. ఆమేరకు గత రెండు నెలల్లో రూ.167 కోట్ల విలువైన 267 కిలోల బంగారం తరలించారని విచారణలో తేలింది. అందుకుగాను రెండు నెలల్లో సబీర్ అలీకి రూ.3 కోట్ల కమీషన్ ముట్టింది. ఓ రోజు వీరి దుకాణంలో గోల్డ్ పౌడర్ ఉందని కస్టమ్స్ అధికారి గమనించగా షాపును తనిఖీ చేయగా ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ షాపులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు అలీ సహా అతనికి సహకరించిన మరో ఏడుగురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.