నెల్సన్ దంపతుల విచారణ
తమిళనాడులో(Tamilnadu) బీఎస్పీ నేత(BSP Leader) ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య(Arm Strong Murder) కేసును చెన్నై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం సినీ దర్శకుడు నెల్సన్(Director Nelson), ఆయన భార్య మోనీషాను(Monisha) పోలీసులు ప్రశ్నించడం సంచలనంగా మారింది. జులైలో ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు తిరువెంగడం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు విచారణ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వివిధ పార్టీల స్థానిక నాయకులు, రౌడీలను అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో కేసు సినీ రంగం వైపుకు వెళ్లింది. ఈ కేసులో ప్రముఖ రౌడీ శంభోశంకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన గుండు కృష్ణన్ కోసం వెతుకుతున్నారు. తమకు లభించిన ఆధారాలు, పట్టుబడ్డ వారు ఇచ్చిన వివరాలు, సెల్ నెంబర్లు, కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు విచారణను సాగిస్తున్నారు. గుండు కృష్ణన్‌తో జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ సతీమణి మోనీషా పలుమార్లు మాట్లాడినట్టు విచారణలో తేలింది. దీంతో మోనీషాను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. . అలాగే నెల్సన్ ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.