సమాజంలో వింత పోకడలు కనిపిస్తున్నాయి. కొందరు సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక సమాజమంటూ అడవి జంతువులులాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోని అక్కడక్కడ కనిపించే సంస్కృతి మన దేశానికి కూడా పాకుతోంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ లేని సంస్కృతి కూడా మన దేశ గడప తొక్కింది.

సమాజంలో వింత పోకడలు కనిపిస్తున్నాయి. కొందరు సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక సమాజమంటూ అడవి జంతువులులాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోని అక్కడక్కడ కనిపించే సంస్కృతి మన దేశానికి కూడా పాకుతోంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ లేని సంస్కృతి కూడా మన దేశ గడప తొక్కింది. విషయానికొస్తే.. చెన్నైలో(Chennai) సెక్సె రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. అయితే ఈ సెక్స్‌ రాకెట్‌లో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైఫ్‌ స్వాపింగ్(Wife swappig) అంటే భార్యలను మార్చుకోవడం అనే రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు.

ఇందుకు సోషల్‌ మీడియాను(Social media) ఈ ముఠా వేదికగా చేసుకుంది. ఏకంగా సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్‌ చేసి భార్యల మార్పుపై ప్రకటనలు చేస్తున్నారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. కోయంబత్తూర్(Coimbatore), మదురై(Madurai), సేలం, ఈరోడ్‌ ప్రాంతాల్లో ఈ సెక్స్‌ రాకెట్ 8 ఏళ్లుగా నడుస్తోంది. భార్యలను మార్చుకునే వారి ముఠా సోషల్ మీడియాలో ఓ పేజ్ కూడా క్రియేట్ చేసింది. భార్యల మార్పిడికి కస్టమర్ల నుంచి 15 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎంత ఎక్కువ డబ్బు చెల్లిస్తే, అంత ఎక్కువ మంది మహిళలు వస్తారు. ముందుగా ఈ ముఠా ఇతరుల భార్యలతో సంబంధం పెట్టుకోవాలనుకునే పురుషుల్ని టార్గెట్ చేసి..కొంతమంది మహిళలను తమ భార్యలుగా చూపిస్తోంది. ఈ మహిళలంతా వివాహితులే కావడం గమననార్హం.

అసలు ఈ వ్యవహారంపై స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్టయిన పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహించి 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని(East cost Road) పనైయూర్‌లో పోలీసులు ఈ దాడిని నిర్వహించారు. ఈ ముఠా గుట్టు రట్టు చేయడమే కాకుండా పలువురు మహిళలను పోలీసులు కాపాడారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో సెంథిల్ కుమార్, కుమార్, చంద్రమోన్, శంకర్, వెల్రాజ్, పేరరాసన్, సెల్వన్, వెంకటేశ్ కుమార్ ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ వైఫ్‌ స్వాపింగ్‌ వ్యవహారం బయటపడడంతో స్థానికులు చీదరించుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా.. అని ప్రశ్నిస్తున్నారు.

Updated On 9 Nov 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story