తమిళనాడులో(Tamilnadu) నివసిస్తున్న తెలుగువారిని అనకూడని మాటలనేసి జైలుకు(Jail) వెళ్లిన నటి కస్తూరికి(Kasturi) ఊరట లభించింది
తమిళనాడులో(Tamilnadu) నివసిస్తున్న తెలుగువారిని అనకూడని మాటలనేసి జైలుకు(Jail) వెళ్లిన నటి కస్తూరికి(Kasturi) ఊరట లభించింది. చెన్నైలోని(chennai) ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని గత శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు. ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు (Egmore Court) రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి దయాళన్.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ (conditional bail) మంజూరు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.