భారతదేశంలో విభిన్న రకాల సంప్రదాయాలు చూస్తుంటాం. వేలాది మంది తెగలు, విభిన్న జాతుల ప్రజలు నివసిస్తుంటారు. ఒక్కో తెగలో, ఒక్కో జాతిలో భిన్న సాంప్రదాయాలు ఉంటాయి. విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారత దేశం. అయితే ఈ కోవలోకి ఓ గ్రామం వస్తుంది.
భారతదేశంలో విభిన్న రకాల సంప్రదాయాలు చూస్తుంటాం. వేలాది మంది తెగలు, విభిన్న జాతుల ప్రజలు నివసిస్తుంటారు. ఒక్కో తెగలో, ఒక్కో జాతిలో భిన్న సాంప్రదాయాలు ఉంటాయి. విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారత దేశం. అయితే ఈ కోవలోకి ఓ గ్రామం వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) మాండ్లా జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో రామ్‌నగర్ సమీపంలో ఈ చౌగాన్ గ్రామం(Chaugan Village) ఉంటుంది
ఈ గ్రామంలో ఓ విచిత్రమైన సంప్రదాయముంది. ప్రజలంతా ఏడాది ఒకే రంగు దుస్తులు ధరించాలి. గ్రామంలో నివసించే ప్రతి మహిళ, పురుషుడు తెల్ల రంగు దుస్తులు(White Colour) ధరించాలన్న షరతు ఉంది. ఊరి జనాభా దాదాపు వెయ్యికి పేనే ఉంటుంది. ఈ గ్రామంలోని ప్రజలంతా ఎల్లప్పుడు తెల్ల దుస్తులే ధరించాలి. ఈ గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లినా, ఇతర గ్రామాల్లోని శుభకార్యాలకు వెళ్లినా వేషధారణ మాత్రం తెల్ల రంగులోనే ఉండాలి. వారి పూర్వీకుల నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని.. మేం కూడా ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని స్థానికులు చెప్తున్నారు. చివరికి పెళ్లి పీటల మీద కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తెల్లని దుస్తులే ధరించాలి. దీనికి చదువుకున్నవారు కూడా అతీతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో తెల్ల బట్టలు ధరించాలని నిబంధన ఉంది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్న ఆలయంలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఊరిలో స్వర్గ మెట్లుగా పిలిచే పురాతన మెట్లు ఉన్నాయి. వీటిని చూసేందుకు టూరిస్టులు వస్తుంటారు. పక్క రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వర్గ మెట్లను సందర్శించి తమ కోరికలు విన్నవించుకుంటారు.