భారతదేశ తీర్థయాత్రలో పవిత్రమైన చార్ ధామ్ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఉత్తరాఖండ్ లో ఉన్న యమునోత్రి ,గంగోత్రి కేదారినాథ్ ,బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల సందర్శన ఈ చార్ ధామ్ యాత్ర. ప్రతి సంవత్సరం ఈ యాత్రకు కొన్ని వేల మంది సందర్శిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున సంప్రదాయపరంగా గంగోత్రి మరియు యమునోత్రిల తలుపులు తెరుచుకుంటాయి. యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమవుతుంది ఈనెల ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ యాత్రకు ఆన్లైన్ […]
భారతదేశ తీర్థయాత్రలో పవిత్రమైన చార్ ధామ్ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఉత్తరాఖండ్ లో ఉన్న యమునోత్రి ,గంగోత్రి కేదారినాథ్ ,బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల సందర్శన ఈ చార్ ధామ్ యాత్ర. ప్రతి సంవత్సరం ఈ యాత్రకు కొన్ని వేల మంది సందర్శిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున సంప్రదాయపరంగా గంగోత్రి మరియు యమునోత్రిల తలుపులు తెరుచుకుంటాయి. యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమవుతుంది ఈనెల ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ యాత్రకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు చేపట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కేవలం సంవత్సరం లో 6 నెలలు మాత్రమే ఈ ఆలయాల సందర్శన ఉంటుంది.
ఏప్రిల్ 22వ తేదీన యమునోత్రి గంగోత్రి తలుపులు తీర్చుకోగా మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 25న కేధార్ నాథ్ తలుపులు ఉదయం 6. లకు ఏప్రిల్ 27న బద్రీనాథ్ తలుపులు తెరుచుకోనున్నాయి .
ఈసారి ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే వారికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నాలుగు విధాలుగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించింది ప్రభుత్వం. భారతదేశం నుంచే కాకుండా విదేశీ పర్యటకుల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ తాకిడి ఉండడంతో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో రోడ్డు మార్గం ద్వారా లేదా వాయు మార్గం ద్వారా లేదా పాదయాత్ర ద్వారా వస్తున్నారా అనే వివరాలతో పాటు ఏ తేదీన ఏ సమయాల్లో వస్తున్నారనే వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది...
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వెబ్సైట్ కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.. మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, అలాగే వాట్సాప్ ద్వారా 8394833833 కూడా ఈ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది అందుబాటులోకి తీసుకువచ్చింది.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు ఎదురైనా ఏదైనా సమాచారం పొందాలి అంటే టోల్ ఫ్రీ నెంబర్ 1364 ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది
ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా జరిగే నష్టాల వలన పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం గట్టి జాగ్రత్తలు తీసుకుంటుంది .ఈ యాత్ర రిజిస్ట్రేషన్ లో తొలి దశలో కేధార్ నాథ్ , బద్రీనాథ్ ఆలయానికి రోజుకి 9,000 నుంచి నుంచి పదివేల మంది మాత్రమే అనుమతించనున్నారు.. ఛార్ ధామ్ యాత్రలో కొత్త ఏర్పాట్లతో భక్తులకు టోకెన్లు ఇవ్వబడతాయి వారు ఏ సమయంలో దర్శనానికి వెళ్ళగలరు అది ముందుగా తెలియజేయడంతో యాత్రికలు ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.
జనవరిలో జోషి మఠం నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే దారిలో రోడ్డుపైన ఏర్పడిన పగుళ్లను ప్రభుత్వం మరమ్మతులు చేస్తుంది. ఎత్తయిన పర్వతప్రాంతాలకి శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉండడంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. దీనిలోభాగంగా ప్రయాణికులు అత్యంత జాగ్రత్తలు వహించాలని దానికి సంబంధించి పటిష్టమైన చర్యలు చేపట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకుని తమ వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.