ముంబాయి మహానగరంలో ..ఒక లోకల్ ట్రెయిన్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ముంబాయి మహానగరంలో ..ఒక లోకల్ ట్రెయిన్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ (Chhatrapati Shivaji terminus) నుంచి కళ్యాణ్‌ (Kalyan) కు ఒక లోకల్ ట్రెయిన్ బయలుదేరింది. రైలు ఘట్‌కోపర్‌ (Ghatkoper) స్టేషన్‌లో ఆగింది. అక్కడ ఓ యువకుడు పూర్తి నగ్నంగా రైలెక్కాడు. నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లోకే అతడు వెళ్ళాడు. దాంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. కంపార్ట్మెంట్ లో ఉన్న మహిళలు హాహాకారాలు చేశారు.

అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ కేకలు వేశారు. అతడు రైల్లోంచి దిగడానికి నిరాకరించాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా కేకలు పెట్టారు. మహిళల అరుపులు విన్న పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడికి చేరుకున్నాడు. నగ్నంగా ఉన్న యువకుడిని కిందకు దిగమని బెదిరించాడు. అతడు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అక్కడే ఉన్నాడు. దాంతో అతడిని పక్క స్టేషన్‌లో బలవంతంగా కిందకు తోయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అధికారుల విచారణలో కూడా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దాంతో అతడికి బట్టలు ఇచ్చి బయటికి పంపించారు.

ehatv

ehatv

Next Story