ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మరోసారి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకమునుపే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు చక్రపాణి మహారాజ్.
ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మరోసారి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకమునుపే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు చక్రపాణి మహారాజ్. చంద్రయాన్ -3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన ప్రదేశానికి ప్రధానమంత్రి మోదీ శివశక్తిగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే! ఇందుకు మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రుడిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివశక్తి పాయింట్‌ను దేశ రాజధానిగా మార్చాలని స్వామి చక్రపాణి మహారాజ్ చెప్పుకొచ్చారు. చందమామను హిందూ సనాతన దేశంగా పార్లమెంట్‌లో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చంద్రయాన్-3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలని అన్నారు. అప్పుడే జిహాదీ మెంటాలిటీ వున్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారని ఓ లాజిక్ చెప్పారు స్వామి చక్రపాణి. ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేయడంలో స్వామి చక్రపాణి ముందుంటారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా వివాదాస్పన వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారికి ఎలాంటి సాయం అందకూడదంటూ కామెంట్ చేసి విమర్శల పాలయ్యారు.