చంద్రయాన్-3 మిషన్(Chandrayaan-3) కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.వీరముత్తువేల్ తన సొంత ఇంటి సంతోషాల్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 20న జరిగిన చెల్లి పెళ్లికి కూడా వెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి పి.పళనివేల్(P. Palanivel) ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. చంద్రునిపై దిగాల్సిన రష్యా ల్యాండర్(Russia Lander) కుప్పకూలిపోవడంతో ప్రపంచం దృష్టంతా భారత్‌కు చెందిన విక్రమ ల్యాండర్(Vikram Lander) మీద పడింది.

Veera Muthuvel
మిషన్ పర్యవేక్షణలోనే ఉండిపోయిన ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్(Veera muthuvel)
చంద్రయాన్-3 మిషన్(Chandrayaan-3) కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.వీరముత్తువేల్ తన సొంత ఇంటి సంతోషాల్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 20న జరిగిన చెల్లి పెళ్లికి కూడా వెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి పి.పళనివేల్(P. Palanivel) ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. చంద్రునిపై దిగాల్సిన రష్యా ల్యాండర్(Russia Lander) కుప్పకూలిపోవడంతో ప్రపంచం దృష్టంతా భారత్‌కు చెందిన విక్రమ ల్యాండర్(Vikram Lander) మీద పడింది. ఈ నెల 23న చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఇది దిగాల్సి ఉండగా ఆ మిషన్ పర్యవేక్షణలోనే నిమగ్నమయ్యారు వీరముత్తువేల్. చంద్రుని మీద ల్యాండర్ విజయవంతంగా దిగగానే ఆయనతో పాటు సొంతూరు విళుపురంలోని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు సంబరాలు చేసుకున్నారు. ఈ విషయమై విశ్రాంతి రైల్వే ఉద్యోగి అయిన పి.పళనివేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘మిషన్ మొదలైనప్పటినుంచి వీరముత్తువేల్ ఇంటికి రాలేదు. చివరికి ఆగస్టు 20న చెల్లి పెళ్లి ఉన్నా హాజరుకాలేదు. నా కుమారుడు చంద్రయాన్-3 ప్రాజెక్టులో పనిచేసినందుకు గర్వపడుతున్నా’ అని తెలిపారు.
