Chandra babu : రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపు వ్యవహారంపై...28న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఈనెల 28వ తేదీన ఢిల్లీ కి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమ ఓట్ల(Illegal votes) తొలగింపు వ్యవహారంపై ఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపులో ‘ఊరూరా ఉరవకొండ’ లాంటి ఘటనలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ సానుభూతిపరుల దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేయనున్నారు.

Chandra babu

వాలంటీర్ల ద్వారా టీడీపీ -వైసీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల సంఘం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి చంద్రబాబు అందించనున్నారు. తెలుగుదేశం నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవట్లేదనే విషయాన్ని కూడా సీఈసీకి నివేదించనున్నారు. ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వచ్చిన సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి సీఈసీకి తెలుగుదేశం పార్టీ సమర్పించనుంది. అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతి అధికారిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని చంద్రబాబు నాయుడు కోరనున్నారు.