కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే అంటూ సాంగేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu). ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీజేపీ(BJP) అధినాయకత్వం కరుణించింది. కనికరించింది. పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకుందామని చెప్పింది. ఈ పిలుపు కోసం నిరీక్షిస్తున్న చంద్రబాబు ఢిల్లీ(Delhi) వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే అంటూ సాంగేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu). ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీజేపీ(BJP) అధినాయకత్వం కరుణించింది. కనికరించింది. పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకుందామని చెప్పింది. ఈ పిలుపు కోసం నిరీక్షిస్తున్న చంద్రబాబు ఢిల్లీ(Delhi) వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ ఆరు నుంచి పది లోక్‌సభ స్థానాలు(Lok sabha) అడిగిందట! మీరు అడగడమూ, నేను కాదనడమూనా అని చంద్రబాబు అన్నారట! అలాగే ఓ డజన్‌ అసెంబ్లీ సీట్లు కూడా మాక్కావాల్సిందేనని కమలనాథులు అంటే ఇవ్వడం మా ధర్మమని చెప్పుకున్నారని వినికిడి! అయితే ఇందులో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చంద్రబాబును ఆడిపోసుకోవడానికి అధికారపక్షానికి ఓ అస్త్రం దొరికినట్టే అవుతుంది. తడవకో పార్టీ చెంతన చేరడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అప్పుడే కొందరు ఎకసెక్కాలాడటం మొదలుపెట్టారు. మీరు యాత్ర -2 సినిమా(Yatra-2) ట్రైలర్‌ చూసే ఉంటారు. అందులో 'ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా! అవసరాలను బట్టి ముందుకుపోవాలి' అని చంద్రబాబు పాత్ర ఓ డైలాగు కొడుతుంది. చంద్రబాబు గురించి తెలిసే ఆ డైలాగు రాసి ఉంటారు. ఆ విధంగా ముందుకుపోతున్న చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెబుతారా? 2019 ఎన్నికలకు ముందు బీజేపీని ఇదే చంద్రబాబు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టుకొచ్చారు కదా! అప్పుడు అల్లమైన బీజేపీ ఇప్పుడు బెల్లంగా ఎందుకు మారింది? అసలు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఏ బలముందని అన్నేసి సీట్లను ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు? 2019 ఎన్నికల్లో ఏపీకి సంబంధించినంత వరకు జనసేనకు వచ్చిన ఓట్లు దాదాపు ఏడు శాతం! అదే బీజేపీకి వచ్చినవి 0.5 శాతం ఓట్లు.

రేప్పొద్దున పాయింట్‌ ఫైవ్‌ పర్సెంట్ ఉన్న బీజేపీకి అన్నేసి స్థానాలు కేటాయిస్తే ఏడు శాతం ఓట్లు ఉన్న మాకెన్ని సీట్లు ఇవ్వాలి? అని జనసేన అడిగిందే అనుకోండి. చంద్రబాబు అప్పుడేం చేస్తారు చంద్రబాబు? సరే బీజేపీ అడిగిన లోక్‌సభ స్థానాల సంగతికొద్దాం! అరకు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, ఏలూరు లేదా ఒంగోలు, హిందూపురం, అనంతపురం, తిరుపతి, రాజంపేట నియోజకవర్గాలను కమలనాథులు కోరుకుంటున్నారు. తెలుగుదేశంపార్టీ(TDP) అంతో ఇంతో బలంగా ఉన్న స్థానాలు ఇవి! ఇలా ఇస్తారని టీడీపీ క్యాడర్‌ అడగడం మొదలుపెట్టింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి మేలు చేద్దామనే బీజేపీ ఈ స్థానాలను అడిగిందనేది సగటు టీడీపీ అభిమాని అనుమానం. నిజంగానే బీజేపీ అడిగిన లోక్‌సభ స్థానాలను చంద్రబాబు ఇస్తే మాత్రం పెద్ద తప్పిదమే అవుతుంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో కయ్యం పెట్టుకున్నారు చంద్రబాబు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీని కసితీరా తిట్టారు. ప్రధాని నరేంద్రమోదీని అయితే నానా మాటలన్నారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నినదించారు. పెళ్లాన్ని వదిలేసినవాడు ప్రజలను ఏం పట్టించుకుంటాడని విమర్శలు చేశారు.

చంద్రబాబు వియ్యంకుడు ప్లస్‌ హీరో బాలకృష్ణ(Balakrishna) కూడా వచ్చిరాని హిందీలో మోదీని బండబూతులు తిట్టారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి రీజన్‌ కూడా చెప్పారు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టే బీజేపీని వదిలేస్తున్నానని అన్నారు చంద్రబాబు. మరి ఇప్పుడు స్పెషల్ స్టేటస్‌ ఇస్తానని బీజేపీ ఏమైనా గట్టి హామీ ఇచ్చిందా? అధికారంలోకి రాగానే హోదాతో పాటు బోల్డన్ని నిధులను ఇస్తానని మాట ఇచ్చిందా? మరి ఎందుకు ఇప్పుడు బీజేపీతో పొత్తు? అంటే చంద్రబాబు ఏం చెబుతారు? 'ఏపీలో మేము ఎలాగూ అధికారంలోకి రాబోతున్నము. రేపు సంక్షేమపథకాలు అమలు కావాలంటే కేంద్రం నిధులు కావాలి కదా! అందుకే పొత్తు పెట్టుకుంటున్నాం' అని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపడనక్కర్లేదు. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. వెన్నుపోటు పొడవడటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని మోదీ కామెంట్ చేశారు. అంతగా పరస్పరం తిట్టిపోసుకున్న మోదీ, చంద్రబాబులు ఇప్పుడు ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ పాడుకుంటుంటే ప్రజలు హర్షిస్తారా? ఇంతకీ బీజేపీ అధినాయకత్వం చంద్రబాబును పిలిచిందన్న వార్త నిజమేనా? లేకపోతే టీడీపీ అనుకూల మీడియా సృష్టించిన అనేకానేక ఫేక్‌ వార్తలలో ఇది కూడా ఒకటా? ఏమో చూడాలి!

Updated On 7 Feb 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story