ఐఏఎస్ ఆఫీసర్(IAS Officer) కావాలని కోట్లాది మంది కలలకంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం దేశంలోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతారు. కొందరు తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ(UPSC) ర్యాంక్ సాధించగా.. కొందరు ఒకటి, రెండు, మూడు.. ఇలా ర్యాంక్ వచ్చే వరకు పోరాడుతూనే ఉంటారు. కానీ చంద్రజ్యోతి(Chandra jyothi) అలా కాదు.

UPSC Ranker Chandra jyoti
ఐఏఎస్ ఆఫీసర్(IAS Officer) కావాలని కోట్లాది మంది కలలకంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం దేశంలోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతారు. కొందరు తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ(UPSC) ర్యాంక్ సాధించగా.. కొందరు ఒకటి, రెండు, మూడు.. ఇలా ర్యాంక్ వచ్చే వరకు పోరాడుతూనే ఉంటారు. కానీ చంద్రజ్యోతి(Chandra jyothi) అలా కాదు. కోచింగ్ లేకుండా ప్రణాళికా(Plan) బద్ధంగా చదివారు. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ర్యాంకు సాధించారు. 22 ఏళ్ల ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
చంద్రజ్యోతి తల్లిదండ్రులు ఆర్మీలో(Army) పనిచేసి రిటైరయ్యారు. తండ్రి దల్బారాసింగ్ ఆర్మీ రేడియాలజిస్ట్‌గా పనిచేశారు. తల్లి మీన్‌సింగ్ లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి చదువుకు ఉన్న ప్రాధాన్యతను చంద్రజ్యోతికి తల్లిదండ్రులు చెప్పేవారు. చంద్రజ్యోతి సింగ్ జలంధర్‌లోని APJ స్కూల్‌లో 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 10 CGPAని సాధించారు, తర్వాత, చండీగఢ్‌లోని భవన్ విద్యాలయలో 12వ తరగతి పరీక్షల్లో ఆమె 95.4%తో ఉత్తీర్ణత సాధించారు. 2018లో, ఆమె ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి చరిత్రలో(History) పట్టభద్రురాలైంది.
జూన్ 2018లో, ఆమె UPSC ప్రిపరేషన్‌ను(UPSC Preperation) ప్రారంభించి, చరిత్రను ఆప్షన్‌గా ఎంచుకుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని లక్ష్యాలను వ్యూహాత్మకంగా ప్రిపేర్ అయ్యారు. ప్రతిరోజూ 1-2 గంటలు వార్తాపత్రికలు చదవడంతో పాటు, ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించేవారు. చంద్రజ్యోతి సింగ్ ఎలాంటి కోచింగ్ లేకుండా తన మొదటి ప్రయత్నంలోనే యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ద్వారా అసాధారణమైన ఘనతను సాధించారు. ఆల్-ఇండియా ర్యాంక్ 28ని కైవసం చేసుకుంది. 22 సంవత్సరాల వయస్సులో చంద్రజ్యోతి సింగ్ ప్రతిష్టాత్మకమైన IAS అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం, ఆమె పంజాబ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
