Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) బెయిల్ పిటీషన్‌ను(Bail Petition) హైకోర్టు(AP High Court) వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(skill Development Scam) కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు, మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

Chandrababu Bail Petition
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) బెయిల్ పిటీషన్‌ను(Bail Petition) హైకోర్టు(AP High Court) వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(skill Development Scam) కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు, మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. సీఐడీ తరుపున కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది.
