సింహాద్రి అప్పన్న(simhadri appanna) నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర(chandhana yatra) లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలోని(Vaishaka Masam) శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ(Akshya tritiya) రోజు జరుగుతుంది.

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయో పంచదశీ చ మాఘే"
హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఉదయం 5.48 గంటల నుంచి తదియ ఘడియలు ప్రారంభమమ్యాయి. రోజంతా తదియ ఉంది. కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజది . శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు కూడా ఇదే అది చెబుతారు. అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు.అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరించేయాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కానీ బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు..దాన, ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు. చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈ రోజు చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు...

Updated On 10 May 2024 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story