అయోధ్యలోని(Ayodhya) రామమందిరం(Ramandhir) నిర్మాణపు పనులు శరవేగంతో సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పనుల వేగం పెంచారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూడా పాల్గొననున్నారు.

అయోధ్యలోని(Ayodhya) రామమందిరం(Ramandhir) నిర్మాణపు పనులు శరవేగంతో సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పనుల వేగం పెంచారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్(Champat Rai), నృపేంద్ర మిశ్రా(Nupendra mishra), మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.వెయ్యేళ్లు అయినా సరే చెక్కు చెదరని,ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోందని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. భక్తుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రతిష్టాపన నిర్వహించబడుతుంది.
రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

Updated On 26 Oct 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story