అయోధ్యలో(Ayodhya) రాముడి ప్రతిష్టాపనకు ముహూర్తం దగ్గరపడింది. ప్రస్తుతం దారులన్నీ అయోధ్యవైపే! అందరి దృష్టి అయోధ్యవైపే! ఎప్పుడెప్పుడు రామమందిరాన్ని దర్శించకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. తమకు తోచిన కానుకలను సిద్ధంచేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి(Challa Srinivasa Shastri) రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. రాముడికి పాదుకాసేవ చేసుకుంటున్నారు.

అయోధ్యలో(Ayodhya) రాముడి ప్రతిష్టాపనకు ముహూర్తం దగ్గరపడింది. ప్రస్తుతం దారులన్నీ అయోధ్యవైపే! అందరి దృష్టి అయోధ్యవైపే! ఎప్పుడెప్పుడు రామమందిరాన్ని దర్శించకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. తమకు తోచిన కానుకలను సిద్ధంచేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి(Challa Srinivasa Shastri) రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. రాముడికి పాదుకాసేవ చేసుకుంటున్నారు. రాముడి పాదుకలతో కోసలను పాలించిన భరతుడిని స్ఫూర్తిగాతీసుకున్న చల్లా శ్రీనివాస శాస్త్రి బంగారు పూత పూసిన తొమ్మిది కిలోల వెండి(Silver) పాదులకను(Paduka) అయోధ్య రామమందిరానికి(Ram Mandir) సమర్పించుకుంటున్నారు. పాదుకలలో విలువైన రత్నాలను కూడా పొదిగారు. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అయిన చల్లా శ్రీనివాస శాస్త్రి.. 41 రోజులపాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, దేశవ్యాప్తంగా పాదుకలను దర్శించుకునే వీలు కల్పించాలని అనుకుంటున్నారు. భద్రాచలం, నాసిక్‌, త్రయంబకేశ్వర్‌, చిత్రకూట్‌, ప్రయాగరాజ్‌ తదితర ప్రాంతాల మీదుగా రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, సంక్రాంతి తర్వాత జనవరి 19న అయోధ్య ఆలయ కమిటీకి పాదుకలను అందించనున్నారు. జనవరి 22న వీటికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి అయిదు వెండి ఇటుకలు అందజేశారు.

Updated On 19 Dec 2023 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story