Gifts To Anju-Nusrullah : అంజు-నస్రుల్లా జోడికి కానుకల మీద కానుకలు, ఇంటిస్థలం, ఉద్యోగం కూడా!
రాజస్తాన్‌కు(Rajasthan) చెందిన అంజు ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే కదా! అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె ఇస్లాం మతం పుచ్చేసుకుంది. తన పేరును ఫాతిమాగా మార్చేసుకుంది. తన ప్రేమికుడు నస్రుల్లాను(Nusrullah) పెళ్లి కూడా చేసేసుకుంది. ఈ ఘటన రెండు దేశాలలో సంచలనం సృష్టించింది. ఇదిలాఉంటే పాకిస్తానీయులు అంజు అలియాస్ ఫాతిమాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫాతిమా, నస్రుల్లాలకు కానుకల మీద కానుకలు ఇస్తున్నారు.
రాజస్తాన్‌కు(Rajasthan) చెందిన అంజు ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే కదా! అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె ఇస్లాం మతం పుచ్చేసుకుంది. తన పేరును ఫాతిమాగా మార్చేసుకుంది. తన ప్రేమికుడు నస్రుల్లాను(Nusrullah) పెళ్లి కూడా చేసేసుకుంది. ఈ ఘటన రెండు దేశాలలో సంచలనం సృష్టించింది. ఇదిలాఉంటే పాకిస్తానీయులు అంజు అలియాస్ ఫాతిమాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫాతిమా, నస్రుల్లాలకు కానుకల మీద కానుకలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా అంజు ఇంటి ముందు క్యూలు కడుతున్నాయట! లేటెస్ట్‌గా ఓ పెద్ద వ్యాపారవేత్త నస్రుల్లా, అంజులకు విలువైన ఫ్లాట్‌ను బహమతిగా ఇచ్చారట! ఇస్తూ ఇస్తూ ఓ మాట కూడా అన్నాడు. ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమన్నాడు. ఫ్లాట్‌తో పాటు భారీ మొత్తంలో చెక్కును కూడా ఇచ్చాడట! ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ ఫంఖ్తూన్ఖ్వా ప్రామిన్స్‌కు వచ్చి మరీ నస్రుల్లాకు ఓ బహుమతి ఇచ్చాడో వ్యాపారి. అంతేకాదు, అంజు అలియాస్ ఫాతిమాకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తానని మాట ఇచ్చాడు. మరో దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లాం మతాన్ని తీసుకున్నదని, ఆమెకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని అన్నాడు. ఇప్పుడీ వీడియో సెన్సేషనల్‌గా మారింది. పాక్ స్టార్ గ్రూప్ అయితే బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఫాతిమాకు ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం చేసేందుకు ఆమె ఆఫీసుకు కూడా రానక్కర్లేదని చెప్పింది. ఇదిలాఉంటే రెండు రోజుల కిందట అంజు తన మొదటి భర్త అరవింద్‌కు ఫోన్ చేసి బెదిరించారట! భర్తతో అంజు మాట్లాడుతున్న ఆడియో వైరల్ అయ్యింది.