ట్రైనీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పూజా ఖేద్కర్‌(Pooja Khedkar) గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.

ట్రైనీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పూజా ఖేద్కర్‌(Pooja Khedkar) గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. పైగా ఆమెపై బోల్డన్ని ఆరోపణలు వస్తున్నాయి. వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే! పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్‌-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్‌ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు(special facilities) కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె ఉద్యోగంలో చేరడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిందట! తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నాయంటూ ఓ అఫిడవిట్‌ ఇచ్చిందని, కానీ వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె హాజరుకాలేదు. దీంతో నిజ నిర్ధారణ కోసం కేంద్రం ఏక సభ్య కమిటీని(Committie) నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు చేసి రెండు వారాల్లోపు నివేదిక ఇస్తుంది.

2022 ఏప్రిల్‌ మాసంలో మొదటిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలిచారు. అప్పుడు ఆమె కోవిడ్‌ సాకుగా చెప్పి వెళ్లలేదు. తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు డుమ్మా కొట్టారు. చివరకు ఆరోసారి పిలుపు వస్తే వెళ్లి పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు పూజా ఖేద్కర్‌ హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్‌ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో కమిషన్‌ సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ తన నియామకాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకోవడం గమనార్హం. ఓబీసీ ధ్రువీకరణ విషయంలోనూ ఈమెపై అనుమానాలు ఉన్నాయి. దీని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్‌ వచ్చినా ఐఏఎస్‌ హోదాను పొందగలిగింది.

మరోవైపు ఆమె వాడిన ఆడీ కారుపై పెండింగ్‌ ఛలాన్లు చాలానే ఉన్నాయి. ఆ కారుపై 21 ట్రాఫిక్‌ ఉల్లంఘన కంప్లయింట్లు ఉన్నట్టు పుణే ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 21 సార్లు రూల్స్ ఉల్లంఘించిన కేసులో సుమారు 27 వేల పెనాల్టీలు ఉన్నాయి. వీటిని కట్టాలంటూ పూజా ఖేద్క‌ర్‌కు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పూజ వాడిన ప్రైవేటు ఆడీ కారుపై ముందు వెనుక మ‌హారాష్ట్ర ప్రభుత్వం అని రాసిన నేమ్‌ప్లేట్ ఉంద‌ని పోలీసులు త‌న నోటీసులో పేర్కొన్నారు. రెడ్ బీక‌న్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశార‌ని పోలీసులు చెప్పారు. ఆ నోటీసులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి ఆఫీస‌ర్లు వెళ్లినా ఆమె ఇంట్లో ఉండేవారు కాదు.

Eha Tv

Eha Tv

Next Story