నాగాలాండ్(Nagaland) పౌరులను కాల్చి చంపిన భద్రతా బలగాలపై నాగాలాండ్ పోలీసులు(Nagaland Police) హత్య కేసు పెట్టారు కానీ వారిని విచారించేందుకు కేంద్రం మాత్రం అనుమతించడం లేదు. 2021 డిసెంబర్ నాలుగున జరిగిన ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగాలాండ్ మోన్ జిల్లా(Mon District)లో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 13(Opration 13) మంది సాధారణ పౌరులు, ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
నాగాలాండ్(Nagaland) పౌరులను కాల్చి చంపిన భద్రతా బలగాలపై నాగాలాండ్ పోలీసులు(Nagaland Police) హత్య కేసు పెట్టారు కానీ వారిని విచారించేందుకు కేంద్రం మాత్రం అనుమతించడం లేదు. 2021 డిసెంబర్ నాలుగున జరిగిన ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగాలాండ్ మోన్ జిల్లా(Mon District)లో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 13(Opration 13) మంది సాధారణ పౌరులు, ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణకు నాగాలాండ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన సిట్ 30 మంది సైనికులపై అభియోగాలు మోపింది. వారిని ప్రశ్నించడానికి పోలీసులు కేంద్ర రక్షణశాఖ నుంచి అనుమతి కోరారు. అయితే సంబంధిత రక్షణ శాఖ అధికారులు మాత్రం అనుమతి నిరాకరించారని కోర్టుకు పోలీసులు తెలిపారు.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. మోన్ జిల్లా ఎన్‌ఎస్‌పీఎన్ గ్రామం సమీపంలో నిషేధిత ఎన్‌ఎస్‌పీఎన్ (కె)కు చెందిన యంగ్ ఆంగ్ చీలికవర్గం తిరుగుబాటుదారులు సంచరిస్తున్నారని భద్రతాదళాలకు సమాచారం అందింది. వెంటనే భద్రతా బలగాలు అలెర్టయ్యాయి. ఆపరేషన్‌ను మొదలు పెట్టాయి. తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డులోకి వచ్చి ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఓ వాహనంపై కాల్పులు జరిపాయి. అయితే ఆ వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదు. కూలీలు. రోజంతా బొగ్గు గనిలో పని చేసి ఇంటికి వెళుతున్నారు. వారిని తిరుగుబాటుదారులుగా బలగాలు భావించడంతోనే ఈ ఘోరం జరిగింది. ఆరుగురు కూలీలు చనిపోయారు. చీకటిపడ్డా కూలీలు ఇంటికి రాకపోయేసరికి గ్రామస్తులు ఆందోళన చెందారు. వారి కోసం వెతికారు. కాల్పుల సంగతి తెలుసుకుని కోపంతో ఊగిపోయారు. బలగాలను చుట్టుముట్టి దాడులు చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. అత్మరక్షణ కోసం భద్రతా బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఇందులో ఏడుగురు మరణించారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు కూడా చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు నాగాలాండ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ 21 పారా కమాండో యూనిట్‌కు చెందిన 30 మంది ఆర్మీ సిబ్బందిపై హత్య, హత్యాయత్నం, సాక్ష్యాల ధ్వంసం వంటి వాటిపై అభియోగాలు నమోదు చేసింది. చంపాలనే ఉద్దేశంతోనే జవాన్లు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. విధుల్లో ఉన్న భద్రతా దళాల చర్యలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్రం నుంచి న్యాయపరమైన అనుమతులు తీసుకోవాలని చట్టం చెబుతోంది.