విద్యుత్ చార్జీలు(Electricity Bill) పెంచుకునేందుకు డిస్కంలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్ సరఫరాకు(Electricity supply) అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల(Consumers) నుంచి రాబట్టుకోవాలని డిస్కంలకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించనట్లయింది. ఈనెల 10న ఎలక్ట్రిసిటీ రూల్స్, 2024 పేరుతో గెజిట్‌ను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపించింది.

current bill-compressed
విద్యుత్ చార్జీలు(Electricity Bill) పెంచుకునేందుకు డిస్కంలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్ సరఫరాకు(Electricity supply) అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల(Consumers) నుంచి రాబట్టుకోవాలని డిస్కంలకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించనట్లయింది. ఈనెల 10న ఎలక్ట్రిసిటీ రూల్స్, 2024 పేరుతో గెజిట్‌ను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రతి ఏడాది నవంబర్‌లోగా వచ్చే ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించిన ఆదాయాలను విద్యుత్ నియంత్రణమండలికి డిస్కంలు అందజేయాలని ఆదేశించింది.
డిస్కంల ఆదాయ అంచనాలను రాబట్టుకునేందుకు అవసరమైన చార్జీలను ఈఆర్సీ ప్రకటిస్తుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తానికి, విద్యుత్ చార్జీలతో వచ్చే ఆదాయ అంచనాలకు తేడా ఉండకూడదని గెజిట్‌లో స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ తేడా మూడు శాతంలోపే ఉండాలని తెలిపింది. స్పష్టంగా చెప్పాలంటే డిస్కంల ఖర్చుకు, ఆదాయానికి మధ్య తేడా ఉండకూడదు. అలా జరగాలంటే విద్యుత్ చార్జీల సవరణ ఎప్పటికప్పుడు జరగాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బును గడువులోగా డిస్కంలు చెల్లించలేకుంటా.. కంపెనీలు విధించే లేట్ ఫీ, ఆదాయ వ్యత్యాసాన్ని కూడా కలిపి వచ్చే మూడేళ్లలో మూడు వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని గెజిట్‌లో స్పష్టం చేశారు.
