క్రీడా మంత్రి రెజర్లనుద్దేశించి విలేఖరులతో మాట్లాడుతూ.. “విచారణ పూర్తి చేయనివ్వండి. ఆ తర్వాత కూడా మీకు సరిగ్గా అనిపించకపోతే.. మీరు నిరసన తెలియజేయవచ్చు. సుప్రీంకోర్టు, క్రీడా శాఖ, పోలీసులపై నమ్మకం ఉండాలి. పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండండని సూచించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై(Brij Bhushan Sharan Singh) నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు(Wrestlers) ఓపిక పట్టాలని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. విచారణను రెజ్లర్లు విశ్వసించాలని అనురాగ్ ఠాకూర్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్న వినేష్ ఫోగట్(Vinesh Phogat), సాక్షి మాలిక్(Sakshi Malik) సహా బజరంగ్ పునియాలను(Bajrang Punia) ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మే 28న పార్లమెంట్ హౌస్ వైపు కవాతుగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన మల్లయోధులు.. హరిద్వార్ వెళ్లి తమ పతకాలను గంగలో పడేయాలని నిర్ణయించుకున్నారు. రెజ్లర్లు హరిద్వార్‌కు వెళ్లగా.. రైతు నాయకుడు నరేష్ టికాయిత్ కోరిక మేరకు వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
క్రీడా మంత్రి రెజర్లనుద్దేశించి విలేఖరులతో మాట్లాడుతూ.. “విచారణ పూర్తి చేయనివ్వండి. ఆ తర్వాత కూడా మీకు సరిగ్గా అనిపించకపోతే.. మీరు నిరసన తెలియజేయవచ్చు. సుప్రీంకోర్టు, క్రీడా శాఖ, పోలీసులపై నమ్మకం ఉండాలి. పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండండని సూచించారు. చాలా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మల్లయోధులకు మద్దతు తెలిపేందుకు వేదికపైకి వెళ్ళాయి. నేను దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఢిల్లీ పోలీసుల విచారణపై వేచి ఉండాలని నా ప్రియమైన క్రీడాకారులను కోరుతున్నానని అన్నారు.