రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే సిబ్బంది మనకు దుప్పట్లు(Blankets) అందిస్తుంటారు.
రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే సిబ్బంది మనకు దుప్పట్లు(Blankets) అందిస్తుంటారు. ఇలా అందించే దుప్పట్ల శుభ్రతపై(Neatness) మీకు అనుమానం రావచ్చు. రైలు ప్రయాణికులకు అందించే దుప్పట్ల పరిశుభ్రత ప్రమాణాలకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini vaishnav) లోక్‌సభలో(Lok sabha) ఒక ప్రశ్నను సమాధానమిచ్చారు. భారతీయ రైల్వేలు ఉపయోగించే ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి ఉతుకుతారని వైష్ణవ్ వ్రాతపూర్వక సమాధానమిచ్చారు. ప్రయాణీకులు మెత్తని బొంత కవర్‌గా ఉపయోగించేందుకు బెడ్‌రోల్ కిట్‌లో అదనపు బెడ్‌షీట్(bedsheet) అందించబడిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా ఈ సమాచారం వచ్చింది. దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే కడగడం ప్రయాణీకులను ఆందోళన కలిగిస్తోంది. ఐరోపా, యునైటెడ్ స్టేట్స్‌లోని సుదూరం ప్రయాణించే రైళ్లలో రోజు, రోజుకు ఉతుకుతారని.. కానీ మనదేశంలో ఇలా చేయడంమేంటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఇలా నెలకొసారి దుప్పట్లు ఉతకడాన్ని వైద్యరంగ నిపుణులు తప్పుపడుతున్నారు. దుప్పట్లు ఉతికే విధానాన్ని మార్చాలని.. తరుచుగా దుప్పట్లను ఉతకాలని కోరుతున్నారు. వస్త్ర పరిశుభ్రతపై పరిశోధనలు, అరుదుగా ఉతికే దుప్పట్ల వల్ల బ్యాక్టీరియా, అలెర్జీ వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.