బీహార్‌లో(Bihar) అసాధారణ స్థాయిలో వర్షాలు(Rains) పడుతున్నాయి కాబట్టే బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయట!
బీహార్‌లో(Bihar) అసాధారణ స్థాయిలో వర్షాలు(Rains) పడుతున్నాయి కాబట్టే బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయట! ఈ మాటన్నది సాక్షాత్తూ కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi). గత కొద్ది రోజులుగా బీహార్‌లో వరుసగా బ్రిడ్జ్‌లు(Bridges) కూలిపోతున్నాయి. 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోయాయి. ఇప్పటి వరకు శివన్, సరన్, మధుబాణి, అరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణగంజ్ జిల్లాలలో వంతెనలు కూలిపోయాయి. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్(Nitish Kumar) జవాబుదారీ వహించాలని ఆర్డేజీ డిమాండ్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన రామ్ మాంఝీ ఇచ్చిన వివరణే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది రుతుపవనాల సమయమని, ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. భారీ వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్‌లు కుప్పకూలిపోతుండటం పలు అనుమానాలను కలిగిస్తోంది. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని బీహార్ జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్(Chaitanya Prasad) అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది.